సుమారు మూడు దశాబ్ధాల పాటు వివిధ ప్రధాన తెలుగు దిన పత్రికలలో జర్నలిస్ట్ గా పని చేసిన అనుభవం,మనకూ ఒక పత్రిక కావాలన్న తపనతో “యజ్ఞొపవీతం “అను బ్రాహ్మణ చైతన్య మాస పత్రికను తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభించాను.అనతికాలంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న మన తెలుగు బ్రాహ్మణులకు చేరువ అయ్యింది. బ్రాహ్మణ పత్రిక అని బహిర్గతంగా వెలువడుతున్నా,పత్రికలో ప్రచురించబడుతున్న వివిధ అంశాలపై ఆసక్తితో బ్రాహ్మణులపై ఉన్న అభిమానం,గౌరవం చేత అన్యకులస్థులు కూడా పాటకులు కావటం విశేషంగా భావిస్తున్నాం.ఆధ్యాత్మిక పరంగా మంచి విషయాలు, సత్సంప్రదాయాల గురించి తెలుసుకోగలుగుతున్నాం అని వారు తృప్తిని వ్యక్తపరుస్తున్నారు.మా తండ్రిగారు కీ||శె||”ఓరుగంటి వెంకట రమణయ్య” స్వతంత్రసమరయోధుదే కాక పాత్రికేయుడుగా వారు తుదిశ్వాస వరకు పనిచేశారు.వారి అభిరుచి,వారి వంశాంకురంగా జర్నలిజం పట్ల ఆసక్తి కలిగింది.దీనితో బీ.యల్ చదివినా జర్నలిజానికే అంకితంఅయ్యాను.బ్రాహ్మణుడిగా జన్మించినందుకు తోటి బ్రాహ్మణులకు నావంతు సేవను అందించటానికి ఒక వేదికగా నాకు బాగా తెలిసిన జర్నలిజం ద్వారా సేవలు అందించాలన్న తలంపుతో “యజ్ఞొపవీతం ” ఆవిష్కరించాను.ప్రతి బ్రాహ్మాణుడు ఈ పత్రిక చూసి గర్వపదేలా అహర్నిశలూ కృషి చేస్తూ…మీ ఆశీర్వాదం కోరుతూ …మీ ఓరుగంటి మల్లిక్.,సంపాదకులు
Ph: 09966250595
email: contact@yagnopaveetham.com